ETV Bharat / state

మా కాలనీకి రోడ్డు వేయండి.. ఎమ్మెల్యేకు బాలుడి విన్నపం

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​కు వింత అనుభవం ఎదురైంది. మా కాలనీకి రోడ్డు వేయాలంటూ ఎమ్మెల్యే సుంకెకు ఓ బాలుడు విన్నవించాడు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

author img

By

Published : Dec 17, 2020, 9:16 PM IST

మా కాలనీకి రోడ్డు వేయండి ఎమ్మెల్యే సుంకెకు బాలుడి విన్నపం

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో రోడ్డు కోసం ఓ బాలుడు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ను ప్రశ్నించాడు. గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు ఎమ్మెల్యే చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడుతూ ఉండగా బాలుడు యశ్వంత్ తమ కాలనీకి రోడ్డు కావాలని అడిగాడు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్... వెంటనే ఆ కాలనీకి సంబంధించిన రోడ్డు పని ఎస్టిమేషన్ వేయాలని అధికారులకు సూచించారు. సత్వరం రోడ్డు నిర్మించేందుకు ఆయన ఆదేశించారు. బాలుడి ధైర్యానికి ఎమ్మెల్యే ముగ్ధులయ్యారు.

ఇదీ చూడండి: ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.