ప్రజారంజకమైన పాలనను తెరాస ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. తెరాసలో సభ్యత్వం తీసుకున్న వారికి వివిధ సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సతీమణితో కలసి... ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ సభ్యత్వ రసీదులను అందజేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సభ్యత్వం చేయించాలని అన్నారు.
ఇదీ చదవండి: 'ఈ రెండు టెస్టులూ భారత్కు అత్యంత కీలకం'