ETV Bharat / state

ప్రైవేట్​ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం - bjym latest news

లాక్​డౌన్​తో ఆర్థికంగా నష్టపోయిన ప్రైవేట్​ టీచర్లని ఆదుకోవాలని కోరుతూ నల్గొండలో నిరసనలు చేపట్టిన బీజేవైఎం(భారతీయ జనతా యువ మోర్చా) కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెట్టడం తగదని కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లాలో కలెక్టరేట్​ ఎదుట నిరసన చేపట్టారు.

bjym protests at collectorate karimnagar district
ప్రైవేట్​ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేవైఎం
author img

By

Published : Oct 22, 2020, 4:31 PM IST

కరోనా లాక్​డౌన్​ సమయంలో ఆర్థికంగా నష్టపోయిన ప్రైవేట్​ టీచర్లని ఆదుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లాలో నిరసనలు చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం తగదని కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. రెండు రోజుల క్రితం నల్గొండలో నిరసనలు చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు.

ఈ మేరకు కరీంనగర్​ కలెక్టరేట్​ ముందు నిరసన చేపట్టారు. ఇప్పటికైనా ప్రైవేట్​ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలని కృష్ణారెడ్డి అన్నారు. బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం దాడులకు పాల్పడితే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.