బల్దియా ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తున్నందున భాజపా ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కరీంనగర్లోని 1, 2, 3, 24, 25, 26, డివిజన్లలో అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను అభివృద్ధి కోసం ఉపయోగించకుండా... కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులు చేపడుతున్నారని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారని ఆరోపించారు. భాజపా అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు తీసుకొచ్చి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ కుమార్ చెప్పారు.
ఇవీ చూడండి: షాద్నగర్లో చిరుత కలకలం..