ETV Bharat / state

షాద్​నగర్​లో చిరుతను బంధించిన అటవీ అధికారులు

author img

By

Published : Jan 20, 2020, 8:29 AM IST

Updated : Jan 20, 2020, 11:50 AM IST

cheetah caught by forest officers -in-shadnagar in rangareddy district
షాద్​నగర్​లో చిరుతను బంధించిన అటవీ అధికారులు

08:28 January 20

షాద్​నగర్​లో చిరుత పట్టివేత... నెహ్రూ జూ పార్క్​కు తరలింపు

     రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో కలకలం సృష్టించిన చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. అనంతరం హైదరాబాద్​లోని నెహ్రూ జూపార్క్​కు తరలించారు.

           షాద్​నగర్​లోని పటేల్ రోడ్​లో ఓ ఇంటి డాబాపైన చిరుత పడుకుని ఉండటం గమనించిన స్థానికుడు  ఆ ఇంట్లో వారికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని... అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమచారం అందించారు. 

         ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను మత్తుమందు సూదితో షూట్​ చేశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన చిరుత పారిపోయేందుకు ప్రయత్నించి మత్తెక్కడం వల్ల పక్కింట్లో పడిపోయింది. బంధించిన అటవీ శాఖ సిబ్బంది చిరుతను హైదరాబాద్​ నెహ్రూ జూ పార్క్​కు తరలించారు.   

Last Updated : Jan 20, 2020, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.