హన్మకొండలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన మానవమృగాన్ని వెంటనే శిక్షించాలని కరీంనగర్లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ కూడలిలో హోంమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిని ఉరితీయాలని మహిళలు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: అతివలపై అకృత్యాలను నిరసిస్తూ మహిళా సంఘాల నిరసన