రాష్ట్ర ప్రభుత్వం.. పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో మాత్రం జరగడం లేదని భాజపా నేతలు దుయ్యబట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన కాషాయ నేతలు.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
- ఇదీ చూడండి : 'రైతు ధైర్యంగా అడుగేయనంతవరకు ప్రపంచంతో పోటీ పడలేం'