కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. వంశపారంపర్యంగా సేద్యం చేసుకుంటున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విపరీతంగా జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాగంపేటలో భూములు రికార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల రైతు బంధు, రైతు బీమా వర్తించడం లేదని వాపోయారు. భూముల నమోదు ప్రక్రియను సత్వరమే మొదలుపెట్టాలని కోరుతూ తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రాన్ని సమర్పించారు.
- ఇదీ చూడండి : 'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'