ETV Bharat / state

EETELA RAJENDER: 'నన్ను ఓడించే శక్తి.. తెరాసకు లేదు' - ఈటల రాజేందర్​ తాజా వార్తలు

ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయకపోతే దళిత బంధు పథకం వచ్చేది కాదని భాజపా నేత ఈటల రాజేందర్​ అన్నారు. అధికార పార్టీ ప్రజలను మభ్యపెట్టినా.. ప్రజలు మద్దతు ఇచ్చేది తనకేనని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్​ జిల్లా కాట్రపల్లిలో వివిధ కుల సంఘాల ప్రతినిధులతో ఈటల సమావేశం అయ్యారు. పలువురు భాజపాలో చేరారు.

Eetela rajender
ఈటల రాజేందర్​
author img

By

Published : Aug 24, 2021, 11:59 AM IST

Updated : Aug 24, 2021, 12:13 PM IST

20ఏళ్ల ఉద్యమ చరిత్రలో ప్రజాదరణ పొందిన తనను ఓడించే శక్తి తెరాసకు లేదని భాజపా నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ మండలం కాట్రపల్లిలో వివిధ కులసంఘాల ప్రతినిధులతో ఈటల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు భాజపాలో చేరారు. వారందరికీ ఈటల.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెరాస పార్టీలో తిరగకపోతే పింఛను, రేషన్​ కార్డు ఉండదని బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులకు సామాన్య ప్రజలు ఎవరూ బెదిరే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప చుట్టంగా కాదు. ఇరవై ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేశా. ప్రజాదరణ పొందాను. నన్ను ఓడించే శక్తి తెరాసకు లేదు. -ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, భాజపా నేత

మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధిని విస్మరించి హుజూరాబాద్‌లో హామీలు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు. అభివృద్ధి పనుల పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాను పదవికి రాజీనామా చేయకపోతే రేషన్​ కార్డులు, పింఛన్లు, గొర్రెలు, దళిత బంధు పథకాలు వచ్చేవి కావని ఎద్దేవా చేశారు. ఇవన్నీ చేసినా ప్రజల మద్దతు తనకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతోనే పథకాలు అమలు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఈటల హితవు పలికారు. యావత్​ తెలంగాణ ఒక్కటై నియంతృత్వ పాలనను తరిమి కొట్టాలని కోరారు.

ఇదీ చదవండి: EWS GUIDLINES: ఈ సారైనా ఈడబ్ల్యూఎస్‌ అమలయ్యేనా?

Last Updated : Aug 24, 2021, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.