తెలంగాణ రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదును చేయటం జరుగుతుందని కరీంనగర్ జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు వెల్లడించారు. జిల్లా కోర్టు సమీపంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేయటం భాజపాకే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ మోదీతోనే సాధ్యమవుతోందని వెల్లడించారు.
ఇవీచూడండి: చల్లా మల్లారెడ్డి దశదినకర్మకు హాజరైన కేసీఆర్