కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. నియోజకవర్గంలోని వీణవంక మండలం రామక్రిష్ణాపూర్‌ను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించారు. చెక్‌డ్యాంతో పాటు అక్కడే వరి, పత్తి పంటలను చూశారు. వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు.
అనంతరం రైతులతో భట్టి విక్రమార్క మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అధికారులు వచ్చారా లేదా అనే వివరాలను ఆరా తీశారు. పలువురు రైతులు తమను ఆదుకోవాలని భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్