ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి కరీంనగర్ బస్టాండ్ ముందు వామపక్షాల ఆధ్వర్యంలో తెదేపా, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో సన్నరకం వరిధాన్యానికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించిన తర్వాతనే... భారత్ బంద్‌లో పాల్గొనాలని తెరాస ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమండ్ చేశారు.
ఇదీ చూడండి: రైతన్న పోరు: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్