కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కాంతాల రాజిరెడ్డి తన పొలానికి నీరు పెట్టేందుకు వేకువజామున ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. దారి మధ్యలో రెండు ఎలుగుబంట్లు అతనిపై దాడి చేశాయి. ఈ ఘటనలో రాజిరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తీవ్ర రక్తస్రావంతో అస్వస్థతకు గురైన అతనిని స్థానికులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'