ETV Bharat / state

Bandi Sanjay Interesting Comments on Assembly Elections 2023 : 'ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదు'

Bandi Sanjay Interesting Comments on Assembly Elections 2023 : దివాళా తీసిన రాష్ట్ర సర్కారు.. ఖజానా కోసమే ముందస్తు మద్యం టెండర్లు పిలిచిందని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. ఈ క్రమంలోనే ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోబోమని తెలిపారు. తాను ఎక్కడ పోటీ చేయాలో నాయకత్వం నిర్ణయిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay reacts to murder of Peddapalli girl
Bandi Sanjay interesting comments visit to AP
author img

By

Published : Aug 19, 2023, 4:07 PM IST

Updated : Aug 19, 2023, 4:55 PM IST

Bandi Sanjay Interesting Comments on Assembly Elections 2023 : 'ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదు'

Bandi Sanjay on Election Competition : తాను రాజకీయాలు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్​ వెళ్లడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఓటర్‌ లిస్టు తయారీలో ఈసీకి సహకరించేందుకు ఏపీకి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే టికెట్ల విషయంలో తమకు ఓ ప్రణాళిక ఉందని వివరించారు. డబ్బుల కోసమే కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ఎక్కడ పోటీ చేయాలో నాయకత్వం నిర్ణయిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదని అన్నారు. దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం (Bandi Sanjay on Telangana Government).. ఖజానా కోసమే ముందస్తుగా మద్యం టెండర్లను పిలిచిందని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోమని తెలిపారు. ఈ క్రమంలోనే పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరు గార్చేశారని విమర్శించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

Bandi Sanjay Respond on Peddapalli Girl Case : బాలిక మరణాన్ని ఆత్మహత్యగా తేల్చేశారని బండి సంజయ్ ఆరోపించారు. దిశ కంటే దారుణమైన ఘటన ఇది అని అన్నారు. బీఆర్ఎస్​కు చెందిన​ మంత్రే కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో సీఎంవో నుంచి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

"నేను రాజకీయాలు మాట్లాడేందుకు ఏపీ వెళ్లడం లేదు. ఓటర్‌ లిస్టు తయారీలో ఈసీకి సహకరించేందుకు ఏపీకి వెళ్తున్నా. టికెట్ల విషయంలో మాకు ప్రణాళిక ఉంది. డబ్బుల కోసమే కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. దివాలా తీసిన సర్కారు.. ఖజానా కోసమే ముందస్తు మద్యం టెండర్లు వేశారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అడ్డుకోం. నేను ఎక్కడ పోటీ చేయాలో నాయకత్వం నిర్ణయిస్తుంది. ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న చర్చ జరగలేదు." - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ

అసలేం జరిగిందంటే..: పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలో ఈ నెల 14న దారుణ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ అయిన ఓ బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 14న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని.. స్వస్థలానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. బాలిక తన అక్క, బావతో కలిసి రెండు సంవత్సరాల కిందట పెద్దపల్లి సమీపంలో భవన నిర్మాణ పనుల కోసం వచ్చింది.

Bandi Sanjay Counter to KTR : 'ట్విటర్ టిల్లు.. దేశం మిమ్మల్ని గమనిస్తోంది..' కేటీఆర్​కు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay Fires on Telangana Government : 'తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా'

Last Updated : Aug 19, 2023, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.