పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి... ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇంటి ముట్టడికి యత్నించారు మాదిగ విద్యార్థి ఐకాస నాయకులు. ముందుగానే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.
మాదిగ ఐకాస రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా, కాంగ్రెస్ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని మాదిగ విద్యార్థి ఐకాస రాష్ట్ర చైర్మన్ శేఖర్ తెలిపారు.
ఇవీ చూడండి: కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం