అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అన్నమయ్య విగ్రహానికి అభిషేకాలు జరిగాయి. స్వామివారిని తాళ్లపాక పన్నెండవ వంశస్థులు హరినారాయణాచార్యులు దర్శించుకున్నారు. అనంతరం అన్నమయ్య సేవా ట్రస్ట్ గోవింద పతి, శ్రీవారి సేవా సమితి సంయుక్తంగా నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు అన్నమయ్య విగ్రహం నెలకొల్పడం అభినందనీయమని తాళ్లపాక హరినారాయణాచార్యులు అన్నారు.
ఇవీ చూడండి: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు