కేంద్రం నిర్ణయం సరికాదంటూ... ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్లో బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లు ధరించి బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకు విలీన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ నేతృత్వంలో బ్యాంకు పరిరక్షణకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 97 ఏళ్ల చరిత్ర గల బ్యాంకు పేరు అలాగే కొనసాగించాలని... విలీనం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
ఇవీ చూడండి: మద్యంమత్తులో వివాహిత గొంతు కోసిన ఉన్మాది.. ఆ తర్వాత!?