ETV Bharat / state

'కేసీఆర్​తో చాడ వెంకటరెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది'

ముఖ్యమంత్రి కేసీఆర్​తో చాడ వెంకటరెడ్డికి ప్రత్యేక అనుబంధముందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. రేకొండలో అంబేడ్కర్ విగ్రహాన్ని చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను నేడు దేశంలో రాజకీయ పార్టీలు మంట గలుపుతున్నాయని చాడ వ్యాఖ్యానించారు.

ambedkar idol inaugurated by mla satish kumar and chada venkat reddy at karimnagar
'కేసీఆర్​తో చాడ వెంకటరెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది'
author img

By

Published : Apr 11, 2021, 7:48 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రేకొండలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. మహనీయుడైన అంబేడ్కర్ విగ్రహాన్ని తన స్వగ్రామమైన రేకోండలో... చాడా వెంకటరెడ్డి గారు దాతగా వ్యవహరించి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

రేకొండ గ్రామం అంటే చాడ వెంకటరెడ్డి గుర్తుకు వస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్​తో చాడ వెంకటరెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉందని... ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసినా చాడ వెంకట రెడ్డి గురించి మాట్లాడతారన్నారు. దేశ రాజకీయాల్లో కూడా చాడ వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించాలన్నారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను నేడు దేశంలో రాజకీయ పార్టీలు మంట గలుపుతున్నాయని చాడ వ్యాఖ్యానించారు. పదవులలోకి వచ్చే ముందు రాజ్యాంగంపై ప్రమాణాలు చేసి... పదవి వచ్చాక రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తున్నారని... వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఇదీ చూడండి: తండాలో ఒకేసారి 38 మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.