కరీంనగర్-జగిత్యాల రహదారికి ఇరుపక్కల గల చెట్లు, ముళ్ల పొదలను గ్రామీణ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో తొలగించారు. తరచు రహదారి ప్రమాదాలు జరుగుతున్న స్థలాన్ని ఎంపిక చేసుకొని వాహనదారులు ఆటంకం కలుగకుండా సునాయాసంగా ప్రయాణం చేసేందుకు పనులు చేపట్టారు.
రామడుగు మండలం దేశ రాజుపల్లి వద్ద గల కాకతీయ కెనాల్‌కు ఆనుకుని ఉన్న వంతెన వద్ద బాగా పెరిగిన చెట్లను పొదలను జెసీబీ సాయంతో తొలిగించారు. రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కల్పించారు. ముఖ్యంగా కాకతీయ కాలువ నుంచి గల రహదారిపై ప్రయాణించే వారు పరిమిత వేగాన్ని పాటించాలని ఏసీపీ సూచించారు. సుమారు ఫర్లాంగు దూరం వరకు కరీంనగర్- జగిత్యాల రహదారికి ఇరుపక్కల చెట్ల పొదలు తొలగించి మలుపుల వద్ద బాగు చేశారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తండి'