'ప్రజలు గ్యాస్ కొనలేని పరిస్థితి కేంద్రం తెచ్చింది' - Karimnagar District Latest News
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కట్టెల పొయ్యి మండించి ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీపీసీసీ ఆందోళన
సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ కొనలేని పరిస్థితిని కేంద్రం తీసుకొచ్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి మెడిపెల్లి సత్యం ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని విమర్శించారు.
ధరల పెంపుపై కరీంనగర్ జిల్లా చొప్పదండిలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. చొప్పదండి ప్రధాన కూడలి వద్ద కట్టెల పొయ్యి మండించి ఆందోళన చేపట్టారు. రహదారిపై రాస్తారోకో చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
TAGGED:
కరీంనగర్ జిల్లా తాజా వార్తలు