బావులు, కాలువ పూడ్చవద్దంటూ కరీంనగర్ జిల్లాలో రైతులు పోలీసుల కాళ్ల మీద పడి వేడుకున్నారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో మధ్యమానేరు డీ-14 కెనాల్ కాల్వ కోసం సేకరించిన భూమిలో ఉన్న వ్యవసాయ బావులను అధికారులు పూడ్చుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు పంటలు పూర్తయ్యాకే బావులు పూడ్చాలంటూ కెనాల్ దగ్గర భాజపా ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.
విషయం తెలుసుకున్న గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి సంఘటన స్థలానికి చేరుకోగా.. రైతులు ఆయన కాళ్లమీద పడి బావులు పూడ్చడం వెంటనే ఆపివేయాలంటూ కన్నీరు మున్నీరై వేడుకున్నారు. తాము అప్పులు చేసి సాగు చేశామని.. పంట చేతికొచ్చే సమయంలో బావులు పూడ్చితే పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంట చేతికొచ్చే వరకైనా ఆగాలని అధికారులను కోరారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు వేశామని.. ఈ తరుణంలో బావులు పూడ్చితే తమకు చావే గతి అని వాపోయారు.
ఇదీ చూడండి : ఈ విద్యుత్ స్తంభాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు!