కరీంనగర్ జిల్లా మెట్ట ప్రాంత రైతులు యాసంగి పంటలకు సాగునీరు అందక గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారు. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో నీటి కొరత వల్ల వరి ఎండిపోతోంది. సేద్యం చేయలేక రైతులు పంటలను పశువులకు వదిలేస్తున్నారు.
గంగాధర మండలం వెంకటాయపల్లి రైతు నాగెల్లి తిరుపతిరెడ్డి రెండెకరాల వరిని అలాగే వదిలేశాడు. చేసేదేమీ లేక పశువుల కాపరిని పురమాయించాడు. గొర్రెలు, మేకలతో పొలం మేపాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్ సమీపంలో ఉన్నా సకాలంలో సాగు నీరందక ఆ ప్రాంత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఇదీ చూడండి: కొవిడ్ ఉద్ధృతి.. రాష్ట్రంలో మరో 394 కేసులు, 3 మరణాలు