కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ 8 ప్యాకేజీలో నాలుగు బాహుబలి పంపుల వెట్‌రన్ పరీక్ష విజయవంతమైంది. సోమవారం రాత్రి నీటి పంపింగ్ మొదలుపెట్టారు. దీనికి ముందు ఐదో పంపుకు రెండోసారి వెట్‌రన్ నిర్వహించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు ఫోన్లో అభినందనలు తెలిపారు. ఇంజినీర్ ఇన్‌చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్, డీఈ గోపాలకృష్ణ పర్యవేక్షించారు.
ఇవీచూడండి: కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ వెట్‌రన్ విజయవంతం