ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలురాయి - వంద టీఎంసీలు ఎత్తిపోసిన గాయత్రి పంప్​హౌస్​

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో మైలురాయిని దాటింది. ఈ పథకంలో భాగంగా నిర్మించిన గాయత్రి పంపుహౌస్‌ నుంచి మధ్యమానేరు జలాశయానికి నిన్నటికే వంద టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. పునరాకృతిలో భాగంగా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచకముందు వరకు కాళేశ్వరం నీటితో నింపే పెద్ద రిజర్వాయర్‌ మధ్యమానేరే. దీని దిగువనే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఆయకట్టు ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలురాయి
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలురాయి
author img

By

Published : Feb 25, 2021, 5:05 AM IST

సాగుకు నీరందించేలా ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తోంది. తాజాగా గాయత్రి పంపుహౌస్‌ నుంచి మధ్యమానేరు జలాశయానికి బుధవారం నాటికి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసిన నీటిని లేదా... గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి వచ్చిన నీటిని దిగువన ఆయకట్టుకు మళ్లించడానికి నంది పంపుహౌస్‌ను మొదట నిర్మించారు. ఒక్కొక్కటి 124 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంపులు, మోటార్లతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేలా నిర్మించారు. 2019 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 103 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఈ నీటిని ఎత్తిపోయడానికి ఒక్కో మోటారుకు 9.9 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్లు సమాచారం. ఈ పనిని నవయుగ ఇంజినీరింగ్‌ సంస్థ పూర్తి చేసింది. ఈ నీరు మేడారం రిజర్వాయర్‌లో చేరిన తర్వాత 1.9 కిలోమీటర్ల కాల్వ, 15 కిలోమీటర్ల దూరం రెండు సొరంగ మార్గాల ద్వారా లక్ష్మీపూర్‌ సమీపంలో నిర్మించిన గాయత్రి పంపుహౌస్‌ సర్జిపూల్‌కు చేరిన తర్వాత ఎత్తిపోయడం ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో అత్యధిక సామర్థ్యం గల మోటార్లు ఉన్నది గాయత్రి పంపుహౌస్‌లోనే. 2019 ఆగస్టు 11న ఈ పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. అప్పటి నుంచి మధ్యమానేరుకు అవసరమైనప్పుడు ఎత్తిపోస్తున్నారు.

మధ్యమానేరుకు 100 టీఎంసీలు

ఈ ఏడాది జనవరి 17 నుంచి బుధవారం వరకు 19.66 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019-20, 2020-21లో.. అంటే ఈ పంపుహౌస్‌లో నీటిని ఎత్తిపోయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 100 టీఎంసీలు మధ్యమానేరులోకి ఎత్తిపోసినట్లయ్యింది. ఈ పంపుహౌస్‌లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంపులు, మోటార్లను అమర్చగా... ఒక్కో పంపు ద్వారా 3వేల150 క్యూసెక్కుల నీటిని 115 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా నిర్మాణం జరిగింది. ఈ పనిని మేఘ ఇంజినీరింగ్‌ సంస్థ పూర్తి చేసింది. మొత్తం 100 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 1100 మిలియన్‌ యూనిట్లకుపైగా విద్యుత్తును వినియోగించారు. అంటే సరాసరిన ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి 11 మిలియన్‌ యూనిట్లు విద్యుత్తు అవసరమైనట్లు సమాచారం. మధ్యమానేరుకు 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసిన సందర్భంగా బుధవారం సంబంధిత ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ మేఘ ఇంజినీరింగ్‌ ప్రతినిధులు కేక్‌ కోశారు. ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్తును యూనిట్‌కు రూ.5.80 లెక్కన పరిగణనలోకి తీసుకొంటున్నారు. అయితే దీనిని తగ్గించాలనే ప్రతిపాదన ఉంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో జపాన్​ కంపెనీకి జేఐఎమ్​ గుర్తింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.