కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట్ సర్పంచ్ పరవ్వ(55) కరోనాతో మృతి చెందారు. గత నెల 25న కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఇంట్లోనే ఉంటూ ఆమె చికిత్స తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం శ్వాస సరిగా అందకపోవడంతో.. కుటుంబసభ్యులు ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పరిస్థితి విషమించడంతో.. ఇవాళ సాయంత్రం ఆమె కన్ను ముశారు. మృతదేహానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: ఈటలకు రాజేందర్‌కు ఘనస్వాగతం పలికిన అభిమానులు