ETV Bharat / state

మాస్క్​ల బజార్​ చూసొద్దామా...! - కామారెడ్డిలో మాస్క్​ల తయారీ

మీరు ఇంతవరకు రైతుబజార్​లు, బ్యాంగిల్​ బజార్​లు, సూపర్​ బజార్​లు చాలానే చూసి ఉంటారు... అలాగే చైనా బజార్​లు కూడా చూసి ఉంటారు... కానీ ఎక్కడైనా మాస్క్​ల బజార్​​ను చూశారా.? చూడలేదు కదా! అయితే పదండి మరీ... కామారెడ్డికి వెళ్లి మాస్క్​ల బజార్​ను చూసొద్దాం రండి...! కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్​ శరత్​ ప్రోత్సాహం, మెప్మా సహాయంతో మహిళా సంఘాల సభ్యులు 'స్త్రీశక్తి మాస్క్​ల బజార్​'ను ఏర్పాటు చేశారు.

Women Empowerment Mask Bazaar
మాస్క్​ల బజార్​ చూసొద్దామా...!
author img

By

Published : May 8, 2020, 7:48 PM IST

కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నాం. కరోనా వైరస్ ఎలా సంక్రమిస్తుందో, ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. వ్యాధిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్​ కావాల్సిందే... కానీ ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి​ వచ్చే అవకాశం లేదు. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే స్వీయ నియంత్రణ తప్ప మరో మార్గం లేదు.

కరోనా మహమ్మారి విజృంభణను అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించడంతో అన్ని రకాల పరిశ్రమలు, సంస్థలు మూతపడి, పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయి, కనీస నిత్యవసరాలు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్... పట్టణంలోని స్వయం సహాయక బృందాలకు చక్కని అవకాశాన్ని కల్పించారు. మెప్మా సహాయంతో తక్కువ ధరకే పునర్వినియోగ మాస్క్​లను తయారుచేసేలా ప్రోత్సహించారు.​ ఈ తోడ్పాటు ఫలితంగానే రాష్ట్రంలోనే తొలి మాస్క్​ల బజార్​... ఏప్రిల్​ 30న కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు అయింది.

మాస్క్​ల తయారీతో ఉపాధి

జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలు తక్కువ ధరకే పునర్వినియోగ, నాణ్యమైన మాస్క్​ల తయారీకి శ్రీకారం చుట్టారు. లాక్​డౌన్​తో ఉపాధి కరవైన వేళ మహిళా సమాఖ్య సభ్యులు ఒక బృందంగా ఏర్పడి... నిరుపేదలు సైతం కొనుగోలు చేసే విధంగా మాస్క్​లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. 15 కుటుంబాలు మాస్కుల తయారీలో నిమగ్నమయ్యాయి. ఒక్కొక్కరు రోజుకు 250 నుంచి 300... మొత్తంగా కలిపి సుమారు 8,000 మాస్క్​ల వరకు తయారుచేస్తున్నామన్నారు. ఒక్కో మాస్క్​ తయారీకీ అయ్యే ఖర్చు ఐదు రూపాయలు కాగా... బజార్​లో వీటిని పది రూపాయలకి విక్రయిస్తున్నామని తెలిపారు. ఇది పూర్తిగా లాభాపేక్ష లేకుండా... ప్రజాసేవ కోసం చేస్తున్నామని వివరించారు. అంతేగాక బయట లభించే మాస్కులు ఒకసారి మాత్రమే వాడటానికి వీలుగా ఉంటాయని... కానీ తమ స్త్రీశక్తి మాస్క్​లు కాటన్​ వస్త్రంతో తయారుచేయడం వల్ల శుద్ధి చేసి ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చని అంటున్నారు మహిళా సమాఖ్య సభ్యులు.

జిల్లా కలెక్టర్ శరత్​​ తోడ్పాటు

స్వయం సహాయక బృంద మహిళలకు తోడ్పాటునందించేందుకు జిల్లా కలెక్టర్ శరత్... 'స్త్రీశక్తి మాస్క్​ల బజార్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామారెడ్డిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 3 బజార్లు ఏర్పాటు చేయటమే గాక 22 మండల కేంద్రాల్లోనూ వీటిని తెరిచారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలికల్లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వీరి వద్ద రెండేసి మాస్క్​ల చొప్పున కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక మహిళా సమాఖ్య సభ్యులు సైతం ఒక్కొక్కరు రెండేసి మాస్క్​ల చొప్పున కొనుక్కోవాలని తీర్మానించుకున్నారు. ఈ విధంగా కామారెడ్డి మున్సిపాలిటీలో 30,000 పైగా మాస్కులు విక్రయించామని మహిళా సమాఖ్య సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు 52,000 మాస్క్​లు తయారు చేశామని... తమ లక్ష్యం లక్ష మాస్క్​లు తయారుచేసి విక్రయించడమే అంటున్నారు స్త్రీశక్తి మాస్క్​ల బజార్ నిర్వాహకులు.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ 3.0: మాస్కు లేకుండా బయటకొస్తే జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.