ETV Bharat / state

ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు

కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వారం రోజుల్లోనే భార్యాభర్తలు ఇద్దరిని కరోనా రక్కసి చిదిమేసి.. వారి పిల్లలను అనాథలుగా మారిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

wife and husband died in kamareddy district
ఒకే వారంలో భార్య, భర్త మృతి.. అనాథలైన పిల్లలు
author img

By

Published : Aug 14, 2020, 1:51 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి కాలనీకి చెందిన రాజేశ్​ అనే వ్యక్తి ఈ నెల 7న కరోనా లక్షణాలతో మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు. రాజేష్​కు కరోనా లక్షణాల విషయం తెలియక అంత్యక్రియల్లో 70 నుంచి 80 మంది బంధువు పాల్గొన్నారు. రాజేష్​కు కరోనా లక్షణాలుండగా.. అతని భార్యకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. గురువారం ఆమె కూడా మరణించింది.

భర్త చనిపోయిన వారం రోజుల్లోనే భార్య కూడా మరణించగా.. ఆ ఇంట్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణవగా.. రాజేష్​ అంత్యక్రియలకు హాజరైన వారిలో ఆరుగురికి వ్యాధి సోకింది. మలి దశలో తమకు తోడుగా ఉంటారనుకున్న కొడుకు, కోడలు మరణించడంతో రాజేష్ తల్లిదండ్రులు, ఒంటరైన ఇద్దరూ ఆడపిల్లలను చూసి బోరున విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.