కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని గాంధారి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న డీసీఎం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్ల భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ మీద ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు పిల్లలు గాయాలతో బయటపడ్డారు.
గాంధారి మండలం పెద్ద పోతాంగల్ గ్రామానికి చెందిన గంగిరెద్దుల సాయిలు, సావిత్రి పిల్లలతో కలిసి కామారెడ్డి ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో గాంధారి రహదారిపై టీఎస్ 07యూఈ 6465 నెంబరు గల డీసీఎం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ పిల్లలను అంబులెన్స్‌లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రంగారెడ్డి జిల్లాలో దిశ తరహా ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య