కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామ శివారులో ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పింది. మూల మలుపు వద్ద అదుపు తప్పడం వల్ల రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది విద్యార్థులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: నగరమంతా నిఘా నేత్రాలు... ఇక ఉండవు నేరాలు...