ETV Bharat / state

ఆసుపత్రి వార్డులో రెచ్చిపోయిన పేషెంట్ బంధువులు.. ఎందుకంటే..? - Kamareddy Crime News

Attack on Kamareddy Government Hospital security guard: విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుపై ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత వార్డులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు బయటకు పంపించడంతో వారు స్టీల్​ రాడ్లతో చితకబాదారు. అడ్డు వచ్చిన వారిని సైతం తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరాయ్యారు.

Kamareddy Government Hospital
Kamareddy Government Hospital
author img

By

Published : Mar 29, 2023, 7:54 PM IST

Attack on Kamareddy Government Hospital security guard: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో ప్రైవేట్​ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న గంగారాజు అనే వ్యక్తిపై పేషెంట్ల బంధువులు స్టీల్​ రాడ్లు, కంకర రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

బాధితుడు గంగారాజు తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గంగారాజు అనే వ్యక్తి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాలింత మహిళల కోసం కేటాయించిన వార్డులో ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని గమనించాడు. విధి నిర్వహణలో భాగంగా.. ఇది బాలింతల కొరకు కేటాయించిన రూమ్​ అని.. ఇందులో వేరే వ్యక్తులు ఉండొద్దని వారికి సూచించాడు. దీంతో కోపోద్రిక్తులైన సదరు రంజిత్, రాజు.. గంగరాజును హాస్పిటల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చారు.

అడ్డువచ్చిన వారిని సైతం..: అక్కడితో ఆగకుండా స్టీల్ రాడ్లు, కంకర రాళ్లతో తలపై దాడి చేశారు. దీంతో గంగారాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి దాడిని అడ్డుకోబోయిన ఓ మహిళ నర్సుపై ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడారు. అదే సమయంలో గంగరాజు తమ్ముడు భరత్.. తన అన్నకు టిఫిన్ ఇవ్వడానికి హాస్పిటల్ వద్దకు చేరుకున్నాడు. దాడిని గమనించిన భరత్​ అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. ఆయనపై కూడా దాడి చేశారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడ్డ గంగరాజు, భరత్..​ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గాయపరిచిన ఇద్దరు వ్యక్తులపై బాధితులు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపారు.

"నేను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా వర్క్​ చేస్తున్నాను. గత రాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చి లేడీస్​ వార్డులో ఉన్నారు. వారిని ఇక్కడ ఉండకూడదు అని చెప్పా.. దానికి వారు నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఆ తరువాత నాపై దాడి చేశారు. అడ్డుకోబోయిన మా తమ్ముడిని సైతం చితకబాదారు. దాడి చేసిన సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు".- గంగారాజు, సెక్యూరిటీ గార్డు

ఇవీ చదవండి:

వేటకొడవలితో పెదనాన్న తల నరికి.. వీధుల్లో తిరుగుతూ..

బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు

వామ్మో సైకో..! వందల మందిని వణికించాడుగా.. పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.