ఇసుక దందా చేసే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్, వెంకట్రావు, ఇలియాస్లను విధుల నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్వేత తెలిపారు.
ఇసుక దందా చేసే వ్యక్తిని చరవాణిలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావటం వల్ల పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి విచారణ చేసి బాధ్యులైన కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించారు. ఇదే విషయంలో గత నెల 26న ఇక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రేమ్సింగ్ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే.