కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాటశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకువచ్చిన శనగలను తూకం వేశారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ రబీలో అంచనాకు మించిన ధాన్యం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం నీటి ద్వారా మరింత పంటల దిగుబడి వస్తుందని వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొనిరావాలని తెలిపారు.
ఇవీ చూడండి: పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్‌రెడ్డి