కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. బిచ్కుంద మండలం పెద్దదేవాడ, పుల్కాల్ గ్రామాల మధ్య ఉన్న వాగుకు భారీగా వరద నీరు రావటం వల్ల తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. బాన్స్వాడ, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు నాలుగేళ్ల క్రితం రూ.5 కోట్ల 30 లక్షల నిధులతో ప్రారంభించి... మధ్యలోనే నిలిపేశారు. అధికారులు స్పందించి రాకపోకలు సాగేలా వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య