30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి మొక్కలు నాటాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :వారు తనిఖీలు చేసి ఉంటే.. పర్యటకుల ప్రాణాలు నిలిచేవేమో?