కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ఓ కిరాణా షాపులో నిషేధిత గుట్కా, జర్దా అమ్ముతున్నారన్న సమాచారం మేరకు జిల్లా ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు చేశారు. జుక్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని కిరాణా షాపులో పోలీసుల దాడుల్లో నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్లు దొరికాయి. దుకాణం నిర్వహిస్తున్న శ్రీకాంత్ మీద కేసు నమోదు చేసి బిచ్కుందా పోలీస్ స్టేషన్కి తరలించినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి: వలస కూలీల సమస్యలను తీర్చిన రాచకొండ సీపీ