ETV Bharat / state

'పోచారం చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా 25 కిలోల బియ్యం పంపిణీ' - bhansuvada kamareddy

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి స్వీయ నిర్బంధమే ఏకైక మార్గమని స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో తెల్ల రేషన్​కార్డులేని ఒక్కో కుటుంబానికి ఉచితంగా 25 కిలోల బియ్యాన్ని పోచారం చారిటబుల్​ ట్రస్ట్ ​ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని తెలిపారు.

speaker pocharam srinivas reddy press meet in bhansuvada kamareddy
'పోచారం చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా 25 కిలోల బియ్యం పంపిణీ'
author img

By

Published : Apr 8, 2020, 4:07 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని 126 గ్రామ పంచాయతీల పరిధిలో తెల్లరేషన్ కార్డు లేని వారందరికీ ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని స్పీకర్​ పోచారం తెలిపారు. పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తామని వెల్లడించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్ నివారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముందుచూపుతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు ఆహారభద్రత కార్డుల ద్వారా రేషన్ బియ్యాన్ని ప్రతి కుటుంబానికి 12 కిలోల చొప్పున ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. నిత్యావసర కొనుగోలు కోసం ఒక కుటుంబానికి రూ. 1500 కూడా అందజేయనున్నట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు తమతమ ఇళ్లలోనే ఉండడం ఏకైక మార్గమని తెలిపారు.

'పోచారం చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా 25 కిలోల బియ్యం పంపిణీ'

ఇదీ చూడండి: ఇకపై మూడు విభాగాలుగా కరోనా ఆసుపత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.