ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేశారు.
అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కోట్ల రూపాయలు దానం చేసిన దానికంటే రక్తదానం ఎంతో మేలని అన్నారు. రక్తదానంతో మరో వ్యక్తి ప్రాణాలను నిలబెట్టొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా యువర్స్ లైఫ్ యూత్ సభ్యులను అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: వ్యాధుల నివారణే లక్ష్యం.. 'పది నిమిషాలు'లో మంత్రి..!