ETV Bharat / state

BANDI SANJAY: బండి సంజయ్​ రేపటి పాదయాత్రకు విరామం - బండి సంజయ్​ పాదయాత్ర వార్తలు

రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్​లో భాజపా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా హాజరుకానున్నారు. దీంతో రేపటి ప్రజాసంగ్రామయాత్రకు సంజయ్​ విరామం ఇచ్చారు.

BANDI SANJAY
BANDI SANJAY
author img

By

Published : Sep 16, 2021, 9:51 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలం బంజారా నుంచి ఎల్లారెడ్డి వరకు సంజయ్​ పాదయాత్ర చేశారు. పూలమాలలు, హారతులతో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇవాళ్టి పాదయాత్రలో మధ్యప్రదేశ్ భాజపా ఇంఛార్జ్​ మురళీధర్​రావు పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. నిర్మల్​లో జరిగే బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​షా హాజరుకానున్నారు. దీంతో రేపటి పాదయాత్రకు సంజయ్​ విరామం ఇచ్చారు. ఎల్లుండి.. ఎల్లారెడ్డి నుంచి పాదయాత్ర తిరిగి సాగనుంది.

ఆగస్టు 28న చార్మినార్‌(charminar) భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజాసంగ్రామ యాత్రకు బండి సంజయ్​ సమరశంఖం పూరించారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయ మార్పునకు వేదిక కానుందన్నారు. అక్టోబర్ 2న.... హుజూరాబాద్ సభతో తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 ఎన్నికల వరకు విడతల వారీగా ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు భాజపా నేతలు వెల్లడించారు.

ఇదీచూడండి: Nirmal AMITH SHAH Sabha: లక్ష మందితో రేపు నిర్మల్​లో అమిత్​ షా బహిరంగ సభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.