ETV Bharat / state

వార్షిక ప్రణాళికకు ఆమోదం... రైతుకు అగ్రతాంబూలం - SLBC latest news

అన్నదాతలు పెట్టుబడి లేక, బ్యాంకులు సమయానికి రుణాలు ఇవ్వక ప్రైవేటుగా అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. అప్పోసప్పో చేసి ఆరుగాలం కష్టపడి పండిస్తే గిట్టుబాటు ధర లభించక అప్పుల కుప్ప పేరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీని నుంచి గట్టెక్కించేందుకు కర్షకులకు సాగుకు ముందే పంట రుణాలు అందించేందుకు కామారెడ్డి జిల్లాయంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.

kamareddy district latest news
kamareddy district latest news
author img

By

Published : May 3, 2020, 2:38 PM IST

కామారెడ్డి జిల్లా 2020-21 వార్షిక ప్రణాళిక రూ. 3729 కోట్లకు ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ) ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ. 3329 ప్రాధాన్య రంగాలు, మిగిలిన సుమారు రూ. 400 కోట్లు ప్రాధాన్యేతర రంగాలకు చోటు కల్పించారు. గత ఏడాది కంటే స్వల్పంగా రూ. 83 కోట్లు పెరిగింది. జిల్లాలో రూ. 2185 కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా అన్నదాతకు ఆర్థిక చేయూతనిచ్చేలా సులువుగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గత వానాకాలంలో పంట రుణాల లక్ష్యం కొంత వెనుకబడింది. ఈసారి ధరణి ఆధారంగా పట్టా పాసుపుస్తకం, పహాణీ లేకుండానే రుణాలు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

లక్ష్యాలు అధిగమించేలా...

గత ఏడాది రూ.3646.12 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించగా మార్చి నాటికి 80 శాతం మేర మంజూరు చేశారు. పంట రుణాల మంజూరులో కొంత వెనుకబడి ఉంది. వ్యవసాయ రుణాల మాఫీపై సరైన మార్గదర్శకాలు అందకపోవడం వల్ల రుణాల పంపిణీపై ప్రభావం పడింది. ప్రస్తుతం రుణ మాఫీపై స్పష్టత రావడం వల్ల రుణాల లక్ష్యం పెరగనుందని భావిస్తున్నారు.

నాబార్డు నిబంధనల మేరకు ప్రణాళిక...

నాబార్డు నిబంధనల మేరకు జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూపొందించాం. స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల కమిటీ ఆమోదం పొందగానే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు మంజూరు చేస్తాం.

- రాజేందర్‌రెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, కామారెడ్డి

జిల్లా వార్షిక ప్రణాళిక స్వరూపం (రూ. కోట్లలో)...

  • స్వల్ప కాలిక పంట రుణాలు 2185
  • విద్య 40
  • మౌలిక వసతుల కల్పన 0.80
  • దీర్ఘకాలిక పంట రుణాలు (బోర్లు, డ్రిప్‌) 506.26
  • ప్రాధాన్యేతర రంగాలు 400
  • శీతల గిడ్డంగులు, గోదాముల రుణాలు 76.23
  • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలు 313
  • సోలార్‌ ఎల్‌ఈడీ, రెన్యూబుల్‌ ఎనర్జీ పరిశ్రమలు 0.50
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇతర వ్యవసాయ అనుబంధం 87.21

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.