కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఉప్పు ప్రేమలత ప్రసవం కోసం బుధవారం రాత్రి ఆస్పత్రిలో చేరింది.
తొలికాన్పు కావడం వల్ల ఏవైనా సమస్య తలెత్తితే శస్త్ర చికిత్స చేయాలని కుటుంబసభ్యులు కోరారు. సాధారణ ప్రసవమే అవుతుందని వైద్యులు తాత్సారం చేయడం వల్లే మృతశిశువు జన్మించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు ముందే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.