రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ తెలిపారు. రైతులందరూ సంఘటితం కావాలన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామంలో వర్షకాలం 2020 సాగుపై రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అవసరాల దృష్ట్యా, డిమాండ్‌కు తగిన పంటలు పండిచాలని కోరారు. డిమాండ్ ఉంటే మార్కెట్లో అధిక ఉత్పత్తి చేయవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మైలారంలోని రైతులందరూ ఈ సంవత్సరం వానా కాలంలో 100 శాతం సన్న బియ్యం పండిస్తామని కలెక్టర్‌కు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వేసిన పంట వేయకుండా పంట మార్పిడి చేసే పద్ధతిని అవలంబించుకోవాలని రైతులకు కలెక్టర్ తెలిపారు. కూరగాయల పంటలు సాగు చేయాలని వాటికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని కలెక్టర్ శరత్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు