ETV Bharat / state

గురుకులాల్లో గాడి తప్పుతోన్న నాణ్యమైన భోజనం.. సన్నరకం పేరుతో నాసిరకం..!

author img

By

Published : Apr 16, 2022, 5:31 AM IST

Updated : Apr 16, 2022, 6:36 AM IST

అధికారుల పర్యవేక్షణ లేమి.. విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నిఘా లేకపోవడంతో గురుకులాల్లో నాణ్యమైన భోజనం గాడి తప్పింది. నాణ్యత లేని బియ్యం సరఫరాతో విద్యార్థులు అన్నం తినలేకపోతున్నారు. గంజిలా.. గట్టిగా రబ్బర్ బంతి లాగా ఉడికిన అన్నం మారుతుండటం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్లాస్టిక్ బంతిలాగా మారిన అన్నం తినలేక.. తింటే అనారోగ్యం పాలవుతామని ఆందోళన చెందుతున్నారు.

గురుకులాల్లో గాడి తప్పుతోన్న నాణ్యమైన భోజనం.. సన్నరకం పేరుతో నాసిరకం..!
గురుకులాల్లో గాడి తప్పుతోన్న నాణ్యమైన భోజనం.. సన్నరకం పేరుతో నాసిరకం..!
గురుకులాల్లో గాడి తప్పుతోన్న నాణ్యమైన భోజనం.. సన్నరకం పేరుతో నాసిరకం..!

బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆరేళ్లుగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. కొంతకాలం వరకూ బాగానే ఉన్నా.. ఉన్నతాధికారుల నిఘా కొరవడటంతో ఇటీవల పరిస్థితి గాడి తప్పింది. నాణ్యతలేని బియ్యం పంపిణీ చేస్తుండడంతో వండిన అన్నం తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గంజిలా మారిన అన్నం తినలేమంటూ గత వారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌, లింగంపేట బీసీ గురుకులాల్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాజాగా నస్రుల్లాబాద్‌ గిరిజన గురుకులంలోనూ ఇదే పునరావృతమైంది.

ఈ నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ బీర్కూర్‌ బీసీ గురుకులాన్ని పరిశీలించగా.. విద్యార్థుల ఆవేదన కళ్లకు కట్టింది. ముద్దగా ఉన్న అన్నమే పిల్లలకు వడ్డిస్తుండటం కనిపించింది. కొందరు విద్యార్థులు అన్నం రబ్బర్‌లా సాగుతుండటాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ‘‘గత రెండు నెలలుగా సరఫరా అవుతున్న బియ్యం మరీ అధ్వానంగా ఉన్నాయి. అన్నం ముద్దగా మారి, రబ్బర్‌లా సాగుతోంది. తిన్న వెంటనే కడుపునొప్పి సహా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సగం తిని పారేస్తున్నాం. అర్ధాకలితో అలమటిస్తున్నాం’ అని వాపోయారు. అక్కడి వంట సిబ్బంది కూడా అదే ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘అరుగుదల సమస్య తలెత్తుతున్నట్టు పిల్లలు చెప్పడంతో పసుపు, జీలకర్ర, మంచినూనె కలిపి వండుతున్నాం. అన్నం పసుపు వాసన రావడంతో విద్యార్థులు తినలేకపోతున్నారని’ చెప్పారు.

.

ఎందుకిలా..?

ప్రభుత్వం సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులు చేతివాటంతో రైస్‌ మిల్లుల నుంచి తక్కువ నాణ్యత ఉన్న బియ్యాన్ని సేకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చూసేందుకు బియ్యం బాగానే ఉన్నప్పటికీ వండిన తర్వాత ముద్దగా మారుతోందని, బియ్యం మార్చాలని కోరుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గురుకుల పాఠశాలల నిర్వాహకులు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో చెప్పారు.

అధికారులకు తెలియజేశాం..

భోజనం బాగుండటం లేదని, బియ్యం మార్చాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కోరాం. అందరికీ ఇదే బియ్యం సరఫరా చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - మాధవి, ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌, బీర్కూర్‌ బీసీ గురుకులం

కొత్త బియ్యం కావడం వల్లనే..

జిల్లాలోని గురుకులాలకు సన్నబియ్యమే పంపిణీ చేస్తున్నాం. రీసైక్లింగ్‌ బియ్యం అనే ఆరోపణలు అవాస్తవం. 2 నెలలుగా కొత్తబియ్యం పంపిణీ చేస్తున్నాం. ఎక్కువ ఉడికితే అవి ముద్దగా మారే అవకాశం ఉంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. - జితేంద్ర ప్రసాద్‌, డీఎం, పౌరసరఫరాల శాఖ, కామారెడ్డి

ఇవీ చూడండి..

ఈ ఆర్థిక ఏడాదికి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు ప్రభుత్వం టార్గెట్ ఎంతంటే.?

కరెంట్ 125 యూనిట్లు ఫ్రీ.. బస్ టికెట్లపై 50% డిస్కౌంట్.. సీఎం బంపర్ ఆఫర్!

Last Updated : Apr 16, 2022, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.