కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాడ్వాయికి చెందిన హాజీ (43) హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
గురువారం ఇంటికి వెళ్తానని సెలవు తీసుకుని గ్రామ శివారులో పురుగుల మందు తాగి చనిపోతున్నట్టు వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు. ఆమె వద్దని వారించింది. తర్వాత మృతుడి మేనమామైన ఏఆర్ ఎస్సైకి ఫోన్ చేశాడు. అతను పది నిమిషాలపాటు కౌన్సిలింగ్ ఇచ్చిన హాజీ వినలేదు. ఫోన్ పెట్టేసి.. పురుగుల మందు తాగేశాడు.
హాజీ తల్లి పోలీసులుకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి అతడిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కుటుంబకలహాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.