కామారెడ్డి జిల్లా మైలరం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని పోచారం సూచించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 1835 రూపాయలకు, సాధారణ రకం బి గ్రేడ్ ధాన్యం 1815 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - pocharam at kamareddy
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కామారెడ్డిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
కామారెడ్డిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా మైలరం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని పోచారం సూచించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 1835 రూపాయలకు, సాధారణ రకం బి గ్రేడ్ ధాన్యం 1815 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Tg_nzb_09_22_vari_dhanyam_konugolu_kendharnu_prabhinchina_spekar_av_ts10122
అక్టోబర్ 22, 2019.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో ని మైలరం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.
* రైతులు ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం రూ. 1835, సాధారణ రకం బి ధాన్యం రూ. 1815 తో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా దళారులు కొనుగోలు చెసేవారు, ప్రభుత్వం ఇప్పుడు మద్దతు ధరతో, రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తుంది. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులను స్పీకర్ ఆదేశించారు. జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది, ఇప్పటికే 35 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది 2 లక్షల ఎకరాలు సాగు చేశారు. గత ఏడాది 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది సుమారుగా 4.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం. ఇందుకు సుమారు రూ. 800 కోట్లు అవసరం
ఈ కార్యక్రమంలో, ఆర్డీవో రాజేశ్వర్, తాసిల్దర్ అర్చన రైసస జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంఎంపీ పాల్త్య విఠల్, అధికారులు పాల్గొన్నారు