ETV Bharat / state

ఆ జిల్లాలో గ్రామాలకు తరలివచ్చిన పార్కులు! - kamareddy district latest news today

ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాలు అద్దుతున్నాయి. గ్రామాలకు పచ్చని శోభను తెస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల ముఖచిత్రం మారుతోంది. ఇన్నాళ్లూ పట్టణాలకే పరమితమైన పార్కులు.. ఊళ్లలోనూ దర్శనం ఇవ్వనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ప్రకృతి వనాల నిర్మాణం శరవేగంగా సాగుతుంది.

Parks that have flocked to the villages in that kamareddy district
ఆ జిల్లాలో గ్రామాలకు తరలివచ్చిన పార్కులు!
author img

By

Published : Sep 10, 2020, 5:37 PM IST

పల్లెలు సహజత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. పచ్చని వాతవారణం, స్వచ్ఛమైన గాలితో గ్రామాలు ప్రకృతికి నిలయంగా ఉంటాయి. ఈ ప్రకృతికి మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే హరితహారం ద్వారా కోట్లాది మొక్కలు నాటిన ప్రభుత్వం.. ప్రకృతి వనాల పేరుతో మరిన్నింటిని పార్కులుగా మార్చనుంది. అందులో భాగంగా ప్రతి పల్లెలోనూ ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాలకే పరిమితమైన అర్బన్ పార్కుల మాదిరిగానే పల్లె వనాలు సిద్ధం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు కామారెడ్డి జిల్లాలో వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు ఉండగా.. 564 పల్లె ప్రకృతి వనాలు మంజూరు చేశారు. వీటిలో 510 ప్రకృతి వనాలు పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే పూర్తి కాగా.. మరికొన్ని చివరి దశకు చేరాయి. జిల్లాలోని ప్రకృతి వనాల్లో 4 లక్షల 51 వేల 704 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని కలెక్టర్ శరత్ వెల్లడించారు.

అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

ప్రకృతి వనాలు గ్రామాలకు కొత్త అందాలను అద్దుతున్నాయి. గ్రామాలకు పార్కులు తరలి రాగా స్థానికుల్లో సంతోషం కనిపిస్తోంది. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధి హామీ నిధులతోపాటు దాతలు సాయం చేస్తే వారి పేరు పెడుతున్నారు. పార్కుల్లో మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నారు. వనం చుట్టూ ఎత్తుగా పెరిగేవి..లోపలి భాగంలో మధ్యస్థంగా పెరిగేవి, ఇంకా లోపలి భాగంలో చిన్నగా పెరిగే చెట్లను పెంచుతున్నారు. వేప, రావి, మర్రి వంటి భారీ వృక్షాలను హద్దు వెంట.. గన్నేరు, మందార తదితర చెట్లను లోపల పెంచాలని ప్రభుత్వం సూచించింది. పండ్లు, పూలు, ఔషధ మొక్కలు, ఉసిరి, నేరేడు, సీమ చింత, కరివేపాకు, జామ ఇలా అన్ని రకాలను నాటాలని చెప్పింది. పార్కు మధ్యలో నీడనిచ్చే చెట్లను నాటుతారు. అలాగే కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 23 గుంటల స్థలంలో రెండు వేలకు పైగా 18 రకాల మొక్కలు నాటారు.

10 గుంటల స్థలంలోనే

కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం సిద్దాపూర్ సరిహద్దులోని అతిచిన్న గ్రామం. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామంలో 10 గుంటల స్థలంలోనే వెయ్యి మొక్కలు నాటి ప్రకృతిపై పల్లెవాసులు ప్రేమను చాటారు. మియావాకి పద్ధతిలో మొక్కలను పెంచడంతోపాటు గ్రామస్థులకు ఆహ్లాదం కలిగించే ఏర్పాట్లు చేశారు. ప్రకృతి వనాల వల్ల పల్లెల స్వరూపం కొత్తగా కనిపిస్తోందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : కోటికిపైగా లంచం.. అనిశా ఆఫీసులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.