తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేదని లేదని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన ఎంపీ అరవింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడి.. రాష్ట్ర ప్రజల క్షేమం పనిచేస్తున్న తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అధిక శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే అని.. ఎంపీ అరవింద్ తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్