కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జలాశయం నిండు కుండలా మారింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి వరద నీరు రావడంతో జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 56,576 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. 8 గేట్లు ఎత్తి 56,576 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం వల్ల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను ప్రస్తుతం 1403.75 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 16.012 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చదవండి: వరదలతో పాటే వ్యాధులు... పొంచి ఉన్న డయేరియా, మలేరియా, డెంగీ..