కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ(55)కు గత కొంతకాలం క్రితం కరోనా సోకింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకురాగా అంత్యక్రియలు చేసేందుకు ... బంధువులు, గ్రామస్థులు ముందుకు రాలేదు.
గ్రామానికి చెందిన ముస్లిం యువకులు మృతదేహాన్ని ఖననం చేయడానికి ముందుకు వచ్చారు. ముస్లింలు అయినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు