ETV Bharat / state

అబద్ధాలు చెప్పి రైతులను రెచ్చగొడుతున్నారు: గంప గోవర్ధన్‌ - ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తాజా వార్తలు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్​పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Gampa Govardhan
Gampa Govardhan
author img

By

Published : Jan 7, 2023, 10:32 PM IST

కామారెడ్డి పురపాలక సంఘం నూతన మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలపై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించారు. కన్సల్టెన్సీ, డీటీసీపీ చేసిన పొరపాటు వల్లే ఈ గందరగోళం నెలకొందని తెలిపారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయమని పేర్కొన్నారు. ఒక్క గుంట భూమి కూడా పోదని స్పష్టం చేశారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ గురించి 60 రోజుల ముందే పత్రికల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు.

దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు సమయం ఉందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. కామారెడ్డిలో అనేక చోట్ల ఫ్లెక్సీల ద్వారా సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని ఆరోపించారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ అనే విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే.. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రతిపాదనలు తారుమారు చేసిన కన్సల్టెన్సీ, డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. స్ధానిక పరిస్థితులకు అనుగుణంగా, అందరి ఆమోద యోగ్యంగా ఉండేలా తుది ప్లాన్ ఉంటుందని గంప గోవర్ధన్ స్పష్టం చేశారు.

"ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేయండని మాట్లాడుతున్నారు. ఇది కేవలం ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ మాత్రమే. ఆరంభదశలోనే రాజకీయం చేసి.. లేని గందరగోళం సృష్టించారు .అమాయకులైన రైతులను ఇబ్బందులకు గురి చేసి వారిని రోడ్లపైకి తీసుకొచ్చారు. అన్నదాతలకు అబద్ధాలు చెప్పి రెచ్చగొడుతున్నారు." - గంప గోవర్ధన్, కామారెడ్డి ఎమ్మెల్యే

అబద్ధాలు చెప్పి రైతులను రెచ్చగొడుతున్నారు: గంప గోవర్ధన్‌

ఇవీ చదవండి: మాస్టర్‌ప్లాన్‌ రగడ: కోర్టుకెక్కిన కామారెడ్డి రైతులు.. స్పష్టతనిచ్చిన కలెక్టర్

కానిస్టేబుల్​గా ఐదేళ్ల చిన్నారి.. నియామక పత్రంతో పాటు చాక్లెట్స్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.