కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను, విద్యుత్‌పై తీసుకురాబోతున్న నూతన బిల్లులకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ సమర్థిస్తూ ఏకగ్రీవంగా బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు... రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని మంత్రి ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్‌పరం చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని... అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. విద్యుత్ బిల్లులు సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందికి గురిచేసేలా ఉన్నాయని పేర్కొన్నారు.